నవతెలంగాణ – బజార్ హాత్నూర్
తెలంగాణ రాష్ట్ర రైతాంగం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రైతు బంధువు, రైతు బీమా, రైతు రుణమాఫి తదితర నూతన పథకాలు 8 బిఆర్ఎస్ పార్టీ మండల యువజన సంఘం అధ్యక్షులు డబ్బుల చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల యువజన సంఘం అధ్యక్షులు డబ్బుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాల పాలన లో బంగారు తెలంగాణ గా చేసి తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చి రైతులను రైతుబంధుతో ఆదుకున్న నాయకుడు అలాగే నిరుపేద మహిళలకు మేనమామగా కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించి మహిళలను ఆదుకున్న నాయకుడు అంటే అది ఒక కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ పథకాలు గ్రామ గ్రామానికి చేరువయ్యాయి అని తెలిపారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలోని ప్రతి గ్రామంలో, ప్రతీ ఇంట్లో అందాయని కొనియాడారు. అనంతరం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొంగర శారద, మాజీ ఫ్యాక్స్ డైరెక్టర్ చెట్ల వినీల్, నాయకులు రాజన్న, యువజన సంఘం సభ్యులు ప్రభాకర్, తరుణ్, సుకుమార్, నందు, విజయ్, రాజేందర్, విటల్, సతీష్, సాయి తారక్, గోపి, మనివర్ధన్, రాజు, సురేష్, వేణు, కైలాష్, తదితరులు పాల్గొన్నారు.



