Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్

- Advertisement -

– బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ – ఆలేర్ రూరల్

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ,ఆ వైఖరికి నిరసనగా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది విచారణ కాదు.. ప్రతీకారం.ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం”అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని,రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా,దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

అడ్డగోలు హామీలు ఇచ్చి,అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విచారణ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు జంగా స్వామి,పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య,విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మామిడాల భానుచందర్,టీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదరబోయిన వెంకటేష్, భాశేట్టి రాజు,బొమ్మన ఉప్పలయ్య,వార్డు సభ్యులు తేరాల బాలశంకర్,బొంకూరి మల్లేశం,బల్లెపు సంపత్,గంధమల్ల రవి, చాడా సురేందర్ రెడ్డి,ఒగ్గు శ్రీశైలం,బేదరబోయిన శంకరయ్య,ఎదునూరి భాస్కర్,అదేశ్, రాగం,కర్ణాకర్, పుప్పాల మహేష్, సొంఠం ప్రవీణ్,చీరబోయిన పరమేష్, జంగా రాములు, నీల మురళి,సొంటెం సాయి,ఆలేటి ధర్మారెడ్డి,చుక్కల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -