త్వరలోనే నిర్వాసితులకు పెండింగ్ ప్యాకేజీలు వర్తింపజేస్తాం
గజ్వేల్ మున్సిపల్ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తాం : మంత్రి గడ్డం వివేక్
నవతెలంగాణ- గజ్వేల్ రూరల్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట దోచుకున్న కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఎన్నికల ఇన్చార్జి కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూశీకుంట నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంక్షా రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాలలో ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణంతో సర్వం కోల్పోయిన ముంపు బాధితులను అన్ని రకాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ అంశం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నట్టు చెప్పారు.
కేసీఆర్, హరీశ్‌రావుల తప్పుడు నిర్ణయాలతో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నియోజకవర్గ కార్యకర్తల కషితో సర్పంచులను గెలిపించుకున్నట్టుగానే, గజ్వేల్ మున్సిపల్ ను దక్కించుకుందామని చెప్పారు. గ్రామాల్లోని పేదలకు ఇండ్ల నిర్మాణానికి నిధులు, అంతేకాకుండా సన్నబియ్యం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరి చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొనగారి రాజు, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



