ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్ అన్నారు. మంగళవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జన్నారం మండల కేంద్రంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి పరచటంలో ఎంతో కృషి చేశారన్నారు.
రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు చేశాడన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి స్థానంలో నిలపడానికి కృషి చేసిన మహానీయుడు కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు జిల్లా కార్యదర్శి సిటీమల భరత్ కుమార్ జాడి గంగాధర్, మండల ఉపాధ్యక్షులు జంగం సంతోష్ రాష్ట్ర నాయకులు సాయిని ప్రసాద్ నేత మండల మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, చింతగూడ పిఎసిఎస్ చైర్మన్ నాసాని రాజన్న, పురుషోత్తం, లక్ష్మణ్, మహిళా నాయకురాలు సుశీల, శెట్టిపల్లి సత్యం కే నరసింహులు, జునుగురు మల్లయ్య లక్ష్మీనారాయణ దత్తు రాకేష్ రవి ముదిరాజ్, మహేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.



