Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలకు కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

ప్రజలకు కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో హోలీ కొత్త ఆశలు విశ్వాసాలను నింపాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. ప్రజలందరి నడుమ ప్రేమాభిమానాలను విరజిమ్మే రంగుల పండుగగా, హోలీ పండుగ భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకున్నదని తెలిపారు. ఆకులురాలే శిశిరం నుంచి కొత్త చిగురులు తొడిగే వసంతానికి బాటలు వేస్తూ ప్రకృతిలో నూతనత్వానికి సూచకంగా హోలీ నిలుస్తుందని పేర్కొన్నారు. ఆశలు అడుగంటి ఉన్న రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు విశ్వాసాలు తిరిగి పుంజుకోవాలనీ, ప్రజల నడుమ మరింతగా సహోదరతత్వం పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -