- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సర కాలంగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పోరాడిన తీరును అభినందించారు. తెలంగాణ యువత తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని.. రైతులు, మహిళలు, సకల జనులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
- Advertisement -



