Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మకూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఆత్మకూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మాజీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) జన్మదిన సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల కమిటీ ఆధ్వర్ఆత్మకూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలుయంలో చిన్నారి చేతిలో కేక్ కట్ చేయించిన పార్టీ నాయకులు, ఈ సందర్భంగా కేకులు ఒకరి ఒకరికి తినిపించుకుంటూ కార్యకర్తలు ఉత్సవంగా పాల్గొన్నారు. ఈ ఆకర్షణీయ కార్యక్రమంలో మండల అధ్యక్ష లేతాకుల సంజీవరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కెసిఆర్ కఠోర దీక్ష పట్టుదల తో అలుపెరుగని పోరాటంతో మహోద్యమం నాయకత్వం వహించి తెలంగాణ సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు‌.

కెసిఆర్ పాలనలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కెసిఆర్ పాలను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల  కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మండల సమన్వయ కమిటీ సభ్యులు కాంతాల కేశవరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు పాపని రవీందర్ మాజీ ఎంపిటిసి మందపెల్లి సంజీవయ్య బొల్లబోయిన రవియాదవ్, సావురే రాజేశ్వరరావు, కామారం, పెంచికలపేట సర్పంచులు తోట కుమారస్వామి, మందపెల్లి ప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి.అంకూస్, మాజీ సర్పంచ్‌లు వంగాల భాగవాన్ రెడ్డి, రంపీస మనోహర్, నాయకులు సాగర్ శ్రీరాంశెట్టి సుమన్ తదితరులు  భాగస్వాములయ్యారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -