Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాజ్ పూర్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తాజ్ పూర్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో గల బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ప్రజలకు పండ్లు పంపిణి చేసారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు అంగన్వాడీ చిన్న పిల్లలతో కలిసి కెసిఆర్ జన్మదిన వేడుకలు కొనసాగించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణి చేసారు. గ్రామ శాఖ అధ్యక్షులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ వచుడ్దో లేక కెసిఆర్ సచ్చుడో అని రాష్ట్ర సాధనలో ప్రాణాలకు తెగించి మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు కెసిఆర్ అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం రైతులు , ప్రజలు సుఖ, సంతోషాలతో వున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరువాత రైతులకు రైతు బంధు కానీ రైతు భీమా కానీ అందడం లేదని, పంటలకు సకాలంలో యూరియా వంటి ఎరువులు దొరకక చేతికొచ్చినా పంట నేలపాలు అవ్వడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

రైతుల విషయంలోనే కాకుండా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమైయ్యాయి అని ప్రబుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పాలనా జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి , చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.  ప్రజలంతా ఈ విషయాలను గమనించి రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీకి అధిక ఓట్లు వేసి మళ్లీ కెసిఆర్ అని సీఎం చెయ్యాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామా పెద్దలు , విద్యార్థులు పాఠశల సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -