Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం17న తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

17న తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 17న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి టి హరీశ్‌రావు, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్టింగ్‌, కేసీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక పాటను విడుదల చేసే కార్యక్రమాలుంటాయని చెప్పారు. ఈనెల 17న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -