ముఖ్యఅతిథులుగా కేటీఆర్, హరీశ్‌రావు
తలసాని సాయికిరణ్ యాదవ్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ నేత తలసాని సాయి కిరణ్ యాదవ్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు టి హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారని వివరించారు. కేసీఆర్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా 72 కిలోల కేక్ కట్టింగ్, కేసీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక పాటను విడుదల చేసే కార్యక్రమాలుంటాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలుంటాయని చెప్పారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు కిషోర్ గౌడ్, లక్ష్మణ్ మురిశెట్టి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



