- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆధ్వర్యం లో మాజీ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సైతం ఫిబ్రవరి 17న ఉన్నందున వారికి కూడా కేకే కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మెన్ దాదాన్న విఠల్ రావు,పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,సత్య ప్రకాశ్, సుజిత్ సింగ్,దండు శేఖర్, 37వ డివిజన్ కార్పొరేటర్ ప్యాట విజయ లక్ష్మి, ప్యాట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



