- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్టం ఎంతో అభివృద్ది చెందింది అని బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిలా అనిల్ అన్నారు. బిఆర్ ఎస్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన కుభీర్ లో మంగళవారం బిఆర్ ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మండల బిఆర్ ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములో ఉన్న అన్ని నియోజక వర్గాలు అభివృద్ది చెందాయి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో పుప్ఫల పీరాజీ పోశెట్టి మాజీ ఎంపీటీసీ దేవిదాస్ దత్తాత్రి యోగేష్ బిఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



