వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి నిర్వహించారు. ఈ జన్మ దిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కేక్ కటింగ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించి రాష్ట్ర ప్రగతి భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పరిపాలనలోభారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల నాయకులు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ లాగా ఉండాలని దేశ స్థాయిలో గుర్తింపు పొందిన మన పథకాలు, రాష్ట్రానికి గ్రామపంచాయతీ విషయంలో గానీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, తాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక బిరుదులు అవార్డులు ఇవ్వడం జరిగింది అని అన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సతీష్ యాదవ్, సర్పంచులు శివకుమార్ పటేల్,సాయ గౌడ్,రవి, రాజేందర్, వార్డు మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



