Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ.. కేసీఆర్  కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమే కాదని చెప్పాలి. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం అందించిన గొప్ప మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. అలాగే రైతుబంధు, మిషన్ భగీరథ, ఆరోగ్యశ్రీ విస్తరణ, గురుకుల పాఠశాలల స్థాపన వంటి సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన నాయకుడిగా కేసీఆర్  ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి ఆలుమల్ల ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్వి నాయకులు పరశురాములు, పట్టణ అధ్యక్షులు అన్వర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -