Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

జుక్కల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం అయిన కల్వ కుంట్ల చంద్రశేఖరావుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , కార్యకర్తలు భారీగా మండల కేంద్రానికి తరలి రావడం జరిగింది. జుక్కల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లి గంగాధర్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

పార్టీ మండల స్థాయి నాయకులు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో దశాబ్దాల పాటు అహర్నిశలు పోరాడిన మహానేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు . తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా, ప్రతి గ్రామం–ప్రతి కుటుంబం ఆశయాలను తన భుజాలపై వేసుకుని మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసారని  గుర్తు చేశారు .ఉద్యమ సమయాల్లో ప్రజల్లో నమ్మకాన్ని నింపిన వాగ్ధాటి, సంకల్పబలం, ధైర్యసాహసాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేశాయి అని తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటుకు, తర్వాత సంక్షేమం, సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో ఎన్నో ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను దేశంలో ప్రత్యేక స్థానంలో నిలిపిన నాయకత్వం ఆయనది అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా తీసుకుని, సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేసిన దూరదృష్టి నాయకుడికి ఈ పుట్టినరోజు మరెన్నో విజయాలకు నాంది కావాలని మనసారా కోరుకుంటున్నాం అని అన్నారు. కెసిఆర్ఆర్ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరింత సేవ చేసే శక్తి కలగాలని ఆకాంక్షిస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ తల్లికి అంకితభావంతో సేవలందించిన మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు అని కార్యకర్తలు పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -