Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కాటారంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో  మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు, మాజీ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  సెంటర్‌లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

ఈ కార్యక్రమంలో రామిళ్ళ కిరణ్, రత్న సౌజన్య, తోట జనార్షన్, సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, బాసాని రవి, బండం రాజమణి, మానేం రాజబాపు, ఉప్పు సంతోష్, ఎస్‌కే మున్వార్, అయిలి రాజబాబు, చీర్ల తిరుపతి రెడ్డి, వంగ రాజేంద్రచారి, తైనేని సతీష్, ఊరగొండ లింగయ్య, మెడిగడ్డ దుర్గారావు, రత్న రమేష్ రెడ్డి, మంథని చిరంజీవి, కాటారపు రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -