Tuesday, February 17, 2026
E-PAPER
Homeకరీంనగర్వేములవాడలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

వేములవాడలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

భీమన్న సన్నిధిలో కోడెమొక్కు.. కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు..
నవతెలంగాణ – వేములవాడ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) జన్మదినాన్ని వేములవాడ పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు మాజీ ఏఎంసీ చైర్మన్ సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి, మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి స్థానిక భీమేశ్వర ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భీమన్న సన్నిధిలో కోడెమొక్కు చెల్లించుకున్నారు.

అనంతరం పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద భారీగా గుమిగూడిన పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. “జై కేసీఆర్… జై జై కేసీఆర్… లాంగ్ లీవ్ కేసీఆర్…” అంటూ చేసిన నినాదాలతో తెలంగాణ చౌక్ మార్మోగింది. గులాబీ జెండాలతో కార్యకర్తలు చౌక్ ప్రాంతాన్ని సందడిగా మార్చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు నిమ్మచెట్టి విజయ్, గజనందరావు,గోలి మహేష్, మారం కుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, డాక్టర్ శ్రీనివాస్, తదితర పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -