- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 22న మళ్లీ తెరచుకోనున్నాయి. శీతాకాలం నేపథ్యంలో దాదాపు 6 నెలలుగా మూసి ఉంచిన విషయం తెలిసిందే. ఈ ఆలయాన్ని ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. పంచాంగం, హిందూ క్యాలెండర్‌ల ప్రకారం ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. దీంతో గర్వాల్ హిమాలయాల్లో చార్‌ధామ్ యాత్ర షెడ్యూల్ కుడా ఖరారైంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న తెరచుకోనుండగా.. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న అక్షయ తృతీయ నాడు తిరిగి తెరచుకోనున్నాయి.
- Advertisement -



