రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.అబ్బాస్ జూన్ 21,22 తేదీల్లో గద్వాలలో మహాసభ
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ఆవాజ్ సంఘం రాష్ట్ర మూడో మహాసభను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.అబ్బాస్ పిలుపునిచ్చారు. గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికు రహమాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. ఆవాజ్ రాష్ట్ర మూడో మహాసభ జూన్ 21, 22 తేదీలలో జోగులాంబ గద్వాల పట్టణంలో జరగనుందని చెప్పారు. ఈ మాహాసభకు చాలా ప్రాధాన్యత ఉన్నదని, చాలా సామాజిక విప్లవ ఉద్యమాలకు పురిటి గడ్డ అయిన నడిగడ్డ ప్రాంతంలో మహాసభ జరుపుకుంటున్నామని అన్నారు. దీనికి సామాజిక, ప్రజాతంత్ర, లౌకిక సంఘాలతోపాటు మేధావి వర్గం కూడా భాగస్వాములై సహాయ, సహకారాలు అందించి జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటికే దేశంలో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరాయని, ఇంకో పక్క ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతి నెలకొల్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను, వనరులను గుప్పెడు పెట్టుబడుదారులకు దోచిపెట్టడం కొనసాగుతోందన్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థలను నిర్వీర్యం చేసి పౌర హక్కులపై ప్రశ్నించే గొంతులపై దాడి కొనసాగుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, జేఏసీ కన్వీనర్, రహమతుల్లా, ఎండీ.గౌస్, కాంగ్రెస్ గట్టు మండల అధ్యక్షులు అబ్దుల్ జలీల్, రిటైర్ ప్రిన్సిపాల్ ఎండీ.సలీం, ఆవాజ్ నాగర్‌కర్నూల్ కన్వీనర్ ముజాహిద్ షరీఫ్ సాధాతుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఆవాజ్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES