ఎంపీడీఓ అనంత్ రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వర్షాకాలంలో వ్యాదులు సంభవించే అవకాశం ఉంటుందని ఎంపీడీఓ అనంత్ రావు అన్నారు. ముందస్తుగా పలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉంటామని మండల అరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ తెలిపారు. శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని గన్నారం, తిర్మన్ పల్లి, గంగారాం తండా పంచాయతీ పరిధిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింట తిరుగుతూ కులర్లు, పాత టైర్లు తదితర వాటిపై ఉన్న నీటిని పారవేసి శుభ్రతను పాటించాలని, ప్రజలు రోగాల వారిని పడకుండా రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తిరునగరి శ్రీధర్, సింగోటం, గౌస్, సూపర్ వైజర్ అక్బర్ అలీ, ఏఎన్ఎం శారద, భానుప్రియ, కరోబర్లు పిల్లి నరేందర్, శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాశం జ్యోతి, బండ ప్రమీల తోపాటు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES