నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజలు తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాలలో ఆశ వర్కర్లు ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి పారబోశారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు రాకుండా దోమల నివారణ కొరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రపంచ జనాభా దినోత్సవం.. భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, హెచ్ ఇ వో వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్, తదితరులు ఉన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES