Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి 

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి 

- Advertisement -

– మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి కొమురయ్య 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

పట్టణ ప్రజలందరూ ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను వేరు చేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని మున్సిపల్ చైర్మన్ బండి లక్ష్మి కొమురయ్య అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో నాలుగో వార్డులో పట్టణ ప్రగతి ప్రణాళికలు భాగంగా తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ దండి లక్ష్మీ మాట్లాడుతూ నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు.

ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని, ఇంటి వద్దనే తడి చెత్తతో ఎరువు తయారు చేసుకోవాలని తెలిపారు. ఎరువును ఇంటిలోని మొక్కలకు వాడుకోవచ్చని పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా తయారు చేయడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ పిల్లి తిరుపతి ,  ఇంజనీర్ రవికుమార్, బసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్, ఆర్ పి శోభా, జవాన్ సారయ్య  మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -