Monday, April 6, 2026
E-PAPER
Homeజాతీయం12వ పీఆర్సీ ఏర్పాటు చేసిన కేరళ

12వ పీఆర్సీ ఏర్పాటు చేసిన కేరళ

- Advertisement -

తిరువనంతపురం : 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాన కార్యదర్శి విపి జారును ఈ కమిషన్‌కు చైర్మెన్‌గా నియమించింది. న్యాయవాది ఎం రాజగోపాలన్‌ నాయర్‌, రిటైర్డ్‌ అదనపు కార్యదర్శి శ్రీలత సుకుమారన్‌ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. గత నెల 29న కేరళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో 12వ పీఆర్సీ అంశాన్ని ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన సిఫారసులను సమర్పిస్తుంది. మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిషన్‌ను కోరినట్లు బాలగోపాల్‌ సోమవారం తెలిపారు.

ఈ సిఫార్సులను సకాలంలో అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి వి ఆర్‌ శోభ ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సబంధించి ‘ఐదు సంవత్సరాల సూత్రాన్ని అనుసరించడం వామపక్షాల ప్రభుత్వాల విధానం’ అని మంత్రి బాలగోపాల్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. 11వ పీఆర్సీ సిఫారసులను అమలు చేసినందుకు కేరళ ప్రభుత్వంపై రూ. 25 వేల కోట్ల అదనపు భారం పడిందని మంత్రి గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -