Monday, October 20, 2025
E-PAPER
Homeజాతీయంబీహేవియర్‌లో కేరళ అగ్రస్థానం

బీహేవియర్‌లో కేరళ అగ్రస్థానం

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌ వెనుక : ఇండియా టుడే సర్వే

తిరువనంతపురం : దేశవ్యాప్తంగా పౌరుల వైఖరులు, ప్రవర్తన (బిహేవియర్‌)ను అంచనా వేయడానికి ఇండియా టుడే నిర్వహించిన దేశంలోనే మొట్టమొదటి జాతీయ ప్రవర్తనా సూచికలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సర్వేలో నాలుగు ఇతివృత్తాలపై రాష్ట్రాలను అంచనా వేసింది. పౌర ప్రవర్తన, ప్రజా భద్రత, లింగ వైఖరులు, వైవిధ్యం, వివక్షత వంటివి భారతదేశంలో అభివద్ధి చెందుతున్న సామాజిక నిర్మాణంపై వివరణాత్మక రూపాన్ని అందించేందుకు ఈ సర్వే నిర్వహించింది. ఈ అంశాల్లో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర నాల్గవ స్థానంలో ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ అత్యల్ప ర్యాంక్‌ పొందిన రాష్ట్రాలుగా నిలిచాయి. పౌర అవగాహన, సామాజిక బాధ్యతకు శ్రద్ధ అవసరమయ్యే ప్రాంతాలను హైలైట్‌ చేశాయి.

నియమాలకు కట్టుబడి ఉండటం, సమాజ భాగస్వామ్యం, సామాజిక బాధ్యతను కొలిచే పౌర ప్రవర్తన విభాగంలో, తమిళనాడు దేశానికి నాయకత్వం వహించింది. ప్రజా భద్రతలో కేరళ సూచికలో అగ్రస్థానంలో ఉంది. చట్టం అమలు, వ్యక్తిగత భద్రతా భావంపై బలమైన ప్రజా విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది, ఆ తర్వాతి స్థానాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ అత్యల్ప స్థానాలను ఆక్రమించాయి. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ప్రగతిశీల అభిప్రాయాలను ప్రదర్శిస్తూ కేరళ కూడా లింగ వైఖరిలో ముందుంది. ఉత్తరాఖండ్‌, తమిళనాడు దగ్గరగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ అట్టడుగు స్థానంలో ఉన్నాయి. వైవిధ్యం, వివక్ష నిర్మూలన విభాగంలో కేరళ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది. సామాజిక సమ్మిళితత్వం, కుల, మత, సాంస్కృతిక వైవిధ్యాన్ని అంగీకరించడంలో ఉన్నత స్థాయిని ప్రదర్శించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తర్వాతి స్థానాల్లో ఉండగా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ అత్యల్ప స్థానంలో ఉన్నాయి.

సర్వే వివరాలు
స్థూల దేశీయ ప్రవర్తన సర్వే 22 రాష్ట్రాలను కవర్‌ చేసింది. ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా 9,188 మంది పాల్గొన్నారు. వారి నుంచి ప్రతిస్పందనలను సేకరించింది. నమూనాలో దాదాపు సమానమైన లింగ పంపిణీ ఉంది. 50.8 శాతం మంది పురుషులు , 49.2 శాతం మంది మహిళలు, సమతుల్య ప్రాతినిధ్యాన్ని నిర్ధారించారు. సర్వే గ్రామీణ-పట్టణ జనాభా నిష్పత్తిని కూడా ప్రతిబింబిస్తుంది, ప్రతివాదులు పట్టణ ప్రాంతాల నుంచి 54.4 శాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి 45.6 శాతం మంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -