Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయంమరో మైలురాయి దిశగా కేరళ

మరో మైలురాయి దిశగా కేరళ

- Advertisement -

పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా ఘనత : నవంబర్‌ 1న ప్రకటించనున్న సిఎం పినరయి విజయన్‌

తిరునంతపురం : ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే అనేక రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న కేరళ మరో ఘనత సాధించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రం నుంచి తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా చరిత్ర సృష్టించే స్వర్ణ క్షణాన్ని త్వరలో అందుకోనుంది. కేరళ నుంచి తీవ్ర పేదరికాన్ని నిర్మూలించినట్లు నవంబర్‌ 1న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించనున్నారు. రాజధాని తిరువనంతపురంలో సెంట్రల్‌ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో విజయన్‌ ఈ విషయాన్ని ప్రకటిస్తారని రాష్ట్ర స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబి రాజేష్‌ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు కమల్‌హాసన్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ముఖ్య అతిధులుగా పాల్గొంటారు.

రాష్ట్ర మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధాన వేడుకకు ముందు, తరువాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే నవంబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక స్వపరిపాలన కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. 2021లో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన మొదటి మంత్రివర్గ సమావేశంలో కేరళను అత్యంత పేదలు లేని రాష్ట్రంగా మార్చాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం శాస్త్రీయ, సమగ్ర సర్వే ద్వారా 64,006 అత్యంత పేద కుటుంబాలను గుర్తించారు. ఆహారం, ఆరోగ్యం, జీవనోపాధి, గృహ నిర్మాణం వంటి అంశాల ఆధారంగా మునగడ కష్టంగా ఉన్న కుటుంబాలను అత్యంత పేదలుగా పరిగణించారు. ఈ కుటంబాలకు అవసరమైన సహాయం, సేవలను అందించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.

ముఖ్యమంత్రి నాయక్వతంలో స్థానిక స్వపరిపాలన శాఖ చొరవతో ఈ లక్ష్యం కోసం అన్ని ప్రభుత్వ వ్యవస్థలు, విభాగాలను, స్వచ్చంద సేవకులు, ప్రజలను సమీకరికంచారు. గుర్తించిన 64,006 కుటుంబాల్లో 4,421 కుటుంబాలు (వీటిలో ఎక్కువగా ఉన్నవి ఒంటరి సభ్యుల కుటుంబాలు) మరణించాయి. 261 సంచారల కుటుంబాల జాడ తెలియడం లేదు. ఇవి ఇతర రాష్ట్రాలకు వలసపోయినట్లుగా భావిస్తున్నారు. అలాగే, స్థానిక సంస్థలు ఈ జాబితాలోని కుటుంబాల్లో ఇతర సభ్యులను చేర్చిన సంఘటనలు 47 కేసులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతానికి అత్యంత పేద కుటుంబాల్లో 59,277 మాత్రమే మిగిలిఉన్నాయి. వీటికోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. కాగా, బుధవారం విలేకరుల సమావేశంలో ఎంబి రాజేష్‌తో పాటు ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ మినిస్టర్‌ వి శివన్‌కుట్టీ, జనరల్‌ కన్వీనర్‌ టింకు బిస్వాల్‌ కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -