సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
తిరువనంతపురం : ఎల్డీఎఫ్ ప్రభుత్వంతోనే కేరళ అభివృద్ధి ముడిపడి ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు సాగాలంటే ఎల్డీఎఫ్ ప్రభుత్వమే కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం 5వ కేరళ స్టడీస్ కాంగ్రెస్ ముగింపు సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని మార్చాలంటూ పిలుపునిచ్చేవారు ఈ అభివృద్ధిని ధ్వంసం చేయాలని, అవినీతి, మతతత్వం పాతుకుపోయిన పాత రోజులకు తీసుకువెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అటువంటి వారికి రాష్ట్రం అవకాశం ఇవ్వదని, ప్రస్తుత కేరళ ఎంతోమంది త్యాగాలు, బలిదానాలతో రూపుదిద్దుకుందని అన్నారు.
కేరళను అభివృద్ధి పధంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. సాధించిన విజయాలను వెనక్కి తీసుకోకపోయినా ప్రభుత్వ కొనసాగింపు ఉండకూడదని కొందరు అంటున్నారని, అంటే వారు మతతత్వం, అవినీతితో కేరళ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారా అని నిలదీశారు. మన లక్ష్యం సుసంపన్న కేరళ కావాలని, సంక్షేమ పరంగా అది సుసంపన్నంగా ఉండాలని అన్నారు. మధ్యతరగతి ఆదాయం కలిగినదిగా మరియు ఆధునికంగా ఉండాలని అన్నారు. కేరళను ఆ స్థాయికి అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సామాజిక వ్యవస్థలో ప్రత్యామ్నాయాలతో అది సాధ్యమవుతుందనిఅన్నారు. కేరళలోని ఒక వర్గం మీడియా అసత్యాలను ఉత్పత్తి చేసే మార్గంగా మారిందని విమర్శించారు.
ఎల్డీఎఫ్ ప్రభుత్వంతోనే కేరళ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -



