Saturday, April 4, 2026
E-PAPER
Homeజాతీయంకేరళం ప్రగతి భేష్‌

కేరళం ప్రగతి భేష్‌

- Advertisement -

ఎల్డీఎఫ్‌ పాలనలో అంకితభావం, పారదర్శకత భవిష్యత్తుకు మార్గదర్శకం
ఎన్నికల ప్రచార సభలో ఆర్జేడీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తేజస్వీయాదవ్‌

బేపూర్‌ : కేరళం ప్రగతి అద్భుతంగా ఉన్నదని ఆర్జేడీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తేజస్వీ యాదవ్‌ కొనియాడారు. బేపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి, మాజీమంత్రి మహమ్మద్‌ రియాజ్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల సభకు ఆయన హాజరై ప్రసంగించారు. అనంతరం కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఇండియా బ్లాక్‌లో ఆర్జేడీ తరఫున.. సీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతు తెలిపారు. కేరళంలో అభివృద్ధి జరుగుతున్న తీరు తనను ఆకట్టుకున్నదని తేజస్వీ యాదవ్‌ వివరించారు.

లౌకికశక్తులకు అండగా నిలవాలన్న తన తండ్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ సూచన మేరకు వామపక్షాల అభ్యర్థుల కోసం ప్రచారం చేయటానికి వచ్చానని తెలిపారు. భారత రాజకీయాలలో సీపీఐ(ఎం) స్థానం విశిష్టమైనదని చెప్పారు. ఈ దేశ భవిష్యత్తుకు కేరళంలో వామపక్షాల విజయం అత్యంత కీలకమని అన్నారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాల నిమిత్తం విస్తృతంగా పర్యటించినప్పుడు కేరళం సీఎం పినరయి విజయన్‌ నాయకత్వంలో కేరళం సాధించిన ప్రగతి గురించిన చర్చలు నాకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. సీపీఐ(ఎం) నిరంతర మార్గదర్శకత్వం.. విజయన్‌ సారథ్యం భవిష్యత్తులో కేరళానికి మరింత గొప్ప విజయాన్ని అందిస్తుందని నేను ఆశిస్తున్నానని తేజస్వీయాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -