Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న మహాయోదుడు కేవల్ కిషన్ ముదిరాజ్

ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న మహాయోదుడు కేవల్ కిషన్ ముదిరాజ్

- Advertisement -

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
నవతెలంగాణ-చిన్నకోడూర్  

ఒక వ్యక్తికి ప్రజలు ప్రతి సంవత్సరం జాతర జరుపుతున్నారంటే ఆ వ్యక్తి పోరాటం, త్యాగం ఎలాంటిదో తెలుస్తుందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షులు యామ ధర్మ ఆధ్వర్యం లో పోరాట యోధుడు కేవల్ కిషన్ ముదిరాజ్  జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. విడుదల చేసిన సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణం కోసం కేవల్ కిషన్ గారు సాయుధ పోరాటం లో ముఖ్య భూమిక పోషించారన్నారు.

పేదల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించేవాడని ఆయన పసితనం నుండే సమ సమాజ నిర్మాణం కోసం పరితపించేవాడని దున్నే వాడికి భూమి ఉండాలని భూములు పంచి పెట్టారని అలాగే కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు అని పోరాటం లో భాగంగా గ్రామాలను పర్యటిస్తూ ప్రజలను మమేకం చేసి చైతన్య పరిచే వాడని కొనియాడారు. పాలకులకు శత్రువుగా మారడని జీర్ణించుకోలేని పాలకులు కేవల్ కిషన్ గారిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా ప్రజలను నమ్మించారన్నారు. 1960 డిసెంబర్ 26న మాసాయిపేట లో ప్రజల తో సమావేశం నిర్వహించి ముగించుకొని వెళ్తున్న సమయంలో లారితో ఢీ కొట్టించి దుండగులతో హత్య చేయించారన్నారు. ఆయన ఆశయాలను మనం కొనసాగించాలన్నారు. ఈకార్యక్రమం లో చిన్నకోడూరు సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్, మాచాపూర్ సర్పంచ్ యాట సత్యలక్ష్మి యాదగిరి, మిద్దె రవి , వెల్కటూర్ శ్రీకాంత్ , గొడుగు శ్రీనివాస్ , గాడిచర్ల నాగరాజు, ఇట్టబోయిన బాబు , ఎయ్య రాజయ్య , కొత్త బాల్ రాజ్, గంట శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -