నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024–25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 2,245 జీరో పాఠశాలలు ఉండగా. వీటిలో 1,441 పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ పోస్టులు రెండూ లేకపోగా, మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేరు కానీ టీచర్ పోస్టులున్నాయి. ప్రస్తుతానికి పిల్లలు, ఉపాధ్యాయులు లేని 1,441 పాఠశాలలను ‘తాత్కాలిక మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒకవేళ గ్రామస్థులు పిల్లలను పంపేందుకు ముందుకు వస్తే వెంటనే పాఠశాలలను తిరిగి ప్రారంభించి టీచర్లను నియమిస్తామని స్పష్టం చేశారు.
కాగా కేంద్ర విద్యాశాఖ ప్రతి ఏడాది యూడైస్ ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగానే రాష్ట్రాల పాఠశాలల పనితీరు గ్రేడింగ్ సూచిక నిర్ణయిస్తుండటంతో, జీరో పాఠశాలలు ఎక్కువగా ఉంటే స్కోర్ తగ్గుతుంది. తెలంగాణ జీరో పాఠశాలల్లో దేశంలో అగ్రస్థానంలో ఉందని కేంద్రం ప్రకటించడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం



