డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబి నేషన్‌లో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్క నుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో టబు కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎగ్జైట్‌మెంట్‌ని పెంచుతూ శాండల్‌వుడ్ డైనమో విజరు కుమార్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషించడానికి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఆయన నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు సినిమాకి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్న టబు కూడా కథలో చాలా కీ రోల్‌ని పోషిస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాథ్ పవర్‌ఫుల్ కథ రాశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
పూరి సినిమాలోకీలక పాత్ర
- Advertisement -
RELATED ARTICLES