Saturday, July 5, 2025
E-PAPER
Homeసినిమాహైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌..

హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌..

- Advertisement -

‘తండేల్‌’ సంచలన విజయం తర్వాత నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ మిథికల్‌ థ్రిల్లల్‌ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ పై బీవీ ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
ఇటీవల చిత్ర బృందం తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో నెల రోజుల పాటు జరిగే కీలకమైన రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్య, ఇతర పరిశ్రమల నుండి ప్రముఖ నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. నాగ చైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్‌ రోప్‌ పట్టుకుని కనిపిస్తున్న న్యూ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘ఒన్‌ స్టెప్‌ డీపర్‌.. ఒన్‌ స్టెప్‌ క్లోజర్‌’ అంటూ ఈ పోస్టర్‌లో పేర్కొన్న క్యాప్షన్‌ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్‌ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌ బిగ్గెస్ట్‌ హైలెట్‌గా ఉండబోతోంది. టైటిల్‌, ప్రధాన తారాగణాన్ని మేకర్స్‌ త్వరలోనే అనౌన్స్‌ చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ బి లోక్‌నాథ్‌, సినిమాటోగ్రాఫర్‌: రాగుల్‌ ధరుమన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నరసింహా చారి చెన్నోజు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -