Sunday, October 26, 2025
E-PAPER
Homeసినిమాహైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌..

హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌..

- Advertisement -

వరుణ్‌ తేజ్‌, డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. వరుణ్‌ తేజ్‌తోపాటు ముఖ్య తారాగణం పాల్గొంటున్న ఈ కీలక షెడ్యూల్‌లో చాలా ఇంపార్టెంట్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వరుణ్‌ కెరీర్‌లోనే వెరీ స్పెషల్‌. హర్రర్‌-కామెడీ, ఇండియన్‌ -కొరియన్‌ బ్యాక్‌డ్రాప్‌ ఇలా.. ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే మన దేశంతోపాటు విదేశాల్లో మూడు మేజర్‌ షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేశారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్‌, తమన్‌ కాంబో మరోసారి అదరగొట్టే ఆల్బమ్‌ ఇవ్వబోతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. వరుణ్‌ తేజ్‌, రితికా నాయక్‌, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : మేర్లపాక గాంధీ, నిర్మాతలు: యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సంగీతం: ఎస్‌.తమన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -