హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్ బ్లెండ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్‌ను కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎంటర్టైనింగ్ టోన్‌తో వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఆ వీడియో ఈ చిత్రంలో ఉండే హిలేరియస్ హర్రర్-కామెడీ వరల్డ్ ని పరిచయం చేసింది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు కొరియాలో జరుగుతున్న ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
కొరియాలో కీలక షెడ్యూల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



