హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఇది రవితేజ హీరోగా నటిస్తున్న 76వ సినిమా. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్‌కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లోని లొకేషన్ రెక్కీ పనులు పూర్తి చేసింది. శనివారం నుంచి చిత్రీకరణ ప్రారంభమవు తోంది. అనంతరం జెనీవా, ఫ్రాన్స్‌లో కూడా కీలకమైన సన్నివేశాల షెడ్యూల్ జరుగనుంది. మొత్తం 25 రోజుల ఈ షెడ్యూల్‌లో కీలక టాకీ పార్ట్‌తో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు.
‘ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రానికి డీఓపీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి.
స్పెయిన్‌లో కీలక షెడ్యూల్
- Advertisement -
- Advertisement -