Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుట్యూబోర్గ్ సీసాకు కెఎఫ్ లేబుల్

ట్యూబోర్గ్ సీసాకు కెఎఫ్ లేబుల్

- Advertisement -

ఇంతకు సరుకెవరిదో….?
పరకాల కేంద్రంగా హాట్ టాపిక్ అవుతున్న బీర్ల బాగోతం 
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో 
నవతెలంగాణ – పరకాల 

పరకాల కేంద్రంగా నకిలీ బీర్ల దందా కొనసాగుతుందనే టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. బీర్లే కాదు కల్తీ మద్యం దందా జోరుగానే సాగుతున్నట్లు  ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధర కలిగిన పెద్ద బ్రాండ్లలో తక్కువ ధర కలిగిన చిన్న బ్రాండ్లను మిక్స్ చేస్తున్నట్లు వినియోగదారులు చర్చించుకుంటున్నారు.

అంతేకాదు కొన్ని మద్యం బ్రాండ్లలో వాటర్, స్పిరిట్ కలుపుతూ కల్తీ చేస్తున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఈనెల ఆరవ తేదీన పట్టణంలోని రాజన్న వైన్ షాపులో కేఫ్ స్ట్రాంగ్ బీరు కొనుగోలు చేసిన వినియోగదారుడికి వింత అనుభవం ఎదురయింది. ట్యూబోర్గ్ సీసాకు కేఫ్ లేబుల్ తో ఉన్న బీరును  ఇవ్వడంతో అతడు కంగుతిన్నాడు. ఇంతకు ఆ సీసాలో ఉన్న సరుకు ఏ కంపెనీదంటు అతడు షాపు నిర్వాహకుడిని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో వైరల్ గా మారింది.

పరకాల కేంద్రంగా కల్తీ మద్యం దందా కొనసాగుతుందనడానికి ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తుది. కల్తీ మద్యం అమ్మకాలపై దృష్టి సారించాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం అంతా ఎక్సైజ్ తో పాటు స్థానిక పోలీసుల దృష్టికి సైతం వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై నవ తెలంగాణ ప్రతినిధి ఎక్సైజ్ సీఐ తాతాజీ వివరణ కోరగా కేఎఫ్ కంపెనీ ట్యూబోర్గ్ సీసాలను వాడుకున్నట్లు వెల్లడించారు. మధ్యంలో ఎలాంటి కల్తీ లేదని తెలిపారు. ఏది ఏమైనా ఏ శాస్త్రీయ ఆధారం లేకుండా ఎక్సైజ్ చెబుతున్న మాటలను నమ్మాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img