Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

మోడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులివ్వాలి
డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి
ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల అర్హత కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా కేజీబీవీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. కేజీబీవీ ఉపాధ్యాయులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు.

మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు తక్కువ వేతనం చెల్లించడం అన్యాయమన్నారు.  టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ మినిమం బేసిక్ పే చెల్లించాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులకు సి ఆర్ టి లతో సమానంగా వేతనం చెల్లించాలన్నారు. కె జి బి వి పాఠశాలల్లో కేర్ టేకర్లను నియమించాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని కె జి బి వి ఉపాధ్యాయులు చేసిన సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. వారికి 010 పద్దు కింద వేతనం చెల్లించాలని, సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని, పదోన్నతులివ్వాలని, కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం డి షరీఫ్, ప్రధాన కార్యదర్శి ఇప్ప రాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చొక్కయ్య, శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి దూడయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసాచారి, పాలకుర్తి మండల బాధ్యులు కమలాకర్ రెడ్డి, దేవరుప్పుల మండల బాధ్యులు ఎండి జహంగీర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -