Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పేదల ఇండ్లు కూల్చితే ఖబర్దార్: సీపీఐ(ఎం)

పేదల ఇండ్లు కూల్చితే ఖబర్దార్: సీపీఐ(ఎం)

- Advertisement -

డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నోటీసులను వాపస్ తీసుకోవాలి
లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం
గుడికందుల సత్యం సీపీఐ(ఎం) నగర కార్యదర్శి
నవతెలంగాణ – కరీంనగర్ 

కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ పక్కనే ఉన్న హస్తినాపురం కాలనీ పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధృత పోరాటాలు చేస్తామని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి గుడికందుల సత్యం హెచ్చరించారు. ఈరోజు సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో హస్తినపురం బతుకమ్మ కాలనీ పేదల ఇండ్లను సందర్శించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. 

గత 25 సంవత్సరాల నుండి ఎస్సారెస్పీ డ్యామ్ లో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చిందని, మున్సిపల్ అనుమతులతో అన్ని రకాల పనులు చెల్లిస్తూ పేదలు జీవిస్తున్నారని. అటువంటివారిని ఇండ్లు కాలి చేయాలని, లేదంటే కూల్చివేస్తామని డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారని బాధితులు సీపీఐ(ఎం) బృందానికి విన్నవించుకున్నారు. 

ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. 25 సంవత్సరాల నుండి అన్ని అనుమతులతో  నిర్మించుకున్న పేదల ఇండ్లను ఎట్లా కూల్చుతారని ప్రశ్నించారు. పేదల ఇంటి ఒక్క ఇటుక కూల్చిన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుల్డోజర్లకు అడ్డుపడి పేదల ఇండ్లను రక్షిస్తామని అన్నారు. గత పాలకులు అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఒక్క ఇల్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ప్రజల పాలన అంటూ పేదలను మోసం చేస్తున్నారని, పేదలకు ఇండ్లు ఇవ్వకపోగా ఉన్న ఇండ్లనే కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసుకుంటూ పేదలను వంచిస్తున్నాయని అన్నారు.  ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ బకాసురులు దర్జాగా కబ్జాలు చేస్తూ అపార్ట్మెంట్లు కడుతుంటే చూస్తూ ఊరుకుంటున్న అధికారులు, పేదల ఇండ్లను మాత్రం కూల్చడానికి ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు.  హస్తినపురంలోని పేదల ఒక్క ఇల్లును కూల్చిన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అడ్డుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వెంటనే వాపస్ తీసుకోవాలని, లేదంటే పేదల పక్షాన దశలవారీగా పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.బీమసాహెబ్, నగర కమిటీ సభ్యులు, గాజుల కనకరాజు, వినయ్, నాయకులు సందేశ్, శివరాజ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img