– కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనపై…
వాషింగ్టన్: కొలంబియా యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులపై బుధవారం న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌వైపీడీ) విరుచుకుపడింది. సెంట్రల్ లైబ్రరీలో ముసుగులు ధరించి శాంతియుతంగా ప్రదర్శన చేపడతున్న నిరసనకారులపై భద్రతా దళాలు దూసుకెళ్లాయి. పాలస్తీనా జెండాలను, బ్యానర్‌లను తొలగించారు. యూనివర్సిటీ సామాజ్రవాద హింస నుంచి లాభం పొందుతుందనికొలంబియా యూనివర్సిటీలోని వర్ణ వివక్ష సమూహం మండిపడింది. బట్లర్ లైబ్రరీలో నిరసనను చేపట్టామని పేర్కొంది. ”అణచివేత ప్రతిఘటననుపెంచుతుంది. కొలంబియా అణచివేతను పెంచితే, విద్యార్థులు క్యాంపస్‌లో అంతరాయాన్ని కలిగిస్తూనే ఉంటారు” అని ఆ సమూహం పేర్కొంది. ‘కొలంబియా కాలిపోతోంది’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. లైబ్రరీ రీడింగ్ రూమ్‌లో గుమిగూడిన నిరసనకారులను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, బయటకు వెళ్లాల్సిందిగా పదేపదే హెచ్చరించామని, కానీ వారు నిరాకరించారని యూనివర్సిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ క్లెర్ షిప్‌మాన్ పేర్కొన్నారు. ముసుగులు తీసి, గుర్తింపు కార్డులు చూపాల్సిందిగా కోరామని అన్నారు. భవనాన్ని సురక్షితంగా ఉంచేందుకు, కమ్యూనిటీ భద్రత కోసం ఎన్‌వైపీడీని యాజమాన్యం అభ్యర్థించిందని ఆమె బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరసనకారులు భవనంలోకి చొరబడేందుకు యత్నించడంతో ఇద్దరు యూనివర్సిటీ పబ్లిక్ సేఫ్టీ అధికారులు గాయపడ్డారని షిన్‌మాన్ పేర్కొన్నారు. 30 మందికి పైగా నిరసనకారుల చేతులను వెనకకు కట్టి లైబ్రరీ నుంచి బయటికి తీసుకువెళుతున్న ద ృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మరికొంత మందిని లైబ్రరీలోకి అనుమతించకుండా బారికేడ్లతో అడ్డగించారు. అదే సమయంలో మరికొంత మంది నిరసనకారులు పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ నినాదాలు చేపట్టారు. ఎంతమందని అరెస్ట్ చేశారన్న అంశంపై సమాచారం లేదని పోలీస్ ప్రతినిధి పేర్కొన్నారు. క్యాంపస్ నిబంధనలను అతిక్రమించిన వారిని బయటికి పంపేందుకు అధికారులు యత్నిస్తున్నారని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ పేర్కొన్నారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హౌచుల్ కూడా ఈ నిరసనలను ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే ఆస్తి విధ్వంసం, హింస ఆమోద యోగ్యం కాదని ఎక్స్‌లో పేర్కొన్నారు.లైబ్రరీని స్వాధీనం చేసుకున్న విధ్వంసకారుల వీసాలను పరిశీలిస్తున్నామని యూఎస్ విదేశంగ కార్యదర్శి మార్క్ రూబియో పేర్కొన్నారు. హమాస్ అనుకూల దుండగులకు అమెరికాలో ఇకపై ప్రవేశించేందుకు అనుమతి లేదని అన్నారు. పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గన్న, గాజాలో ఇజ్రాయిల్ అమానుష దాడులను విమర్శించిన అనేక అమెరికన్ యూనివర్సిటీ విద్యార్థులు, స్కాలర్స్‌పై ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గన్న కొలంబియా యూనివర్సిటీ స్కాలర్ మహమూద ఖలీల్‌ను మార్చిలో అరెస్ట్ చేశారు. ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరించిన అనంతరం కొలంబియా యూనివర్సిటీ మార్చిలో నిరసనలను బహిష్కరించింది. ముసుగులు ధరించి నిరసనల్లో పాల్గోనకూడదని, క్యాంపస్‌లో అరెస్టులు చేసేందుకు, కొత్త ప్రజా భద్రతా అధికారులను నియమించినట్టు యాజమాన్యం ప్రకటించింది.
నిరసనకారులపై ఖాకీల దాష్టీకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES