- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్తలతో శ్రీనగర్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పుకార్ల వ్యాప్తి నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. కొన్ని చోట్ల పోలీసులతో నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లోయలో అదనపు భద్రతా బలగాలను మోహరించి, సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించారు.
- Advertisement -



