- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్‌గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



