Thursday, November 13, 2025
E-PAPER
Homeక్రైమ్khammam: ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన స్కూల్ బస్

khammam: ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన స్కూల్ బస్

- Advertisement -

* తప్పిన భారీ ప్రాణ నష్టం బస్సులో 30 మంది విద్యార్థులు

* ఆటోలో ఇరుక్కుపోయిన ఆటో డ్రైవర్

నవతెలంగాణ బోనకల్

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆగి ఉన్న గ్యాస్ ఆటోను స్కూల్ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా తృటిలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు ప్రాణాలనుంచి బయటపడ్డారు. స్థానికులు, డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ (ఆటో నెంబర్ ఏపీ 39 యు క్యు 2395) నల్లపు నరసింహారావు కిరాయి నిమిత్తం గురువారం ఉదయం చొప్పకట్లపాలెం వచ్చాడు. ఆటోను రోడ్డు పక్కన ఉంచి ఆటోలోనే డ్రైవర్ నరసింహారావు కూర్చొని ఉన్నాడు. అయితే ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన శ్రీ గ్లోబల్ హై స్కూల్ బస్సు (ఏపీ 29 వి 8687) చిరునోములలో విద్యార్థులను ఎక్కించుకొని చొప్పకట్లపాలెం బయలుదేరింది.

చొప్పకట్లపాలెం గ్రామం ముందు ప్రధాన రహదారికి అడ్డంగా గాడి ఉంది. ఆ గాడిలో బస్సు దిగగానే బస్సు కమాన్ కట్ట విరిగింది. దీంతో బస్సు స్టీరింగ్ (స్టక్) పట్టుకుపోవడంతో ఎడమ వైపు వెళ్లాల్సిన బస్సు పూర్తిగా కుడివైపు వేగంగా వెళ్లి ఆగి ఉన్న గ్యాస్ ఆటోను ఢీ కొట్టింది. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఆటోలో ఉన్న డ్రైవర్ నరసింహారావు ఆటోలోని ఇరుక్కుపోయాడు. వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో నుంచి డ్రైవర్ ను బయటకు తీయటానికి సుమారు అర్థగంట పాటు శ్రమించి బయటకు తీశారు. దీంతో డ్రైవర్ ముఖానికి తీవ్ర గాయాలు కాగా కాలు విరిగింది. అయితే ప్రమాదానికి కారణమైన బస్సు ముందు భాగం కూడా దెబ్బతిన్నది. ప్రమాదానికి గురైన బస్సు ఆటోని ఢీ కొట్టి ఓ ఇంటు ప్రహరీ గోడ వరకు వెళ్లి ఆగిపోయింది.

ప్రమాదం జరిగిన రోడ్డు పక్కనే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. బస్సు ఆ గుంతలలో పడిన, ప్రహరీ గోడకు ఢీ కొట్టిన, పక్కనే ట్రాక్టర్ ఇనప సామాన్లను ఢీ కొట్టిన, ఆటోలో గ్యాస్ పేలిన, బస్సు పల్టీ కొట్టిన పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. తృటిలో బస్సు భారీ ప్రమాదం నుంచి బయటపడటంతో 30 మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదానికి గురైన సంఘటన తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లగా మరి కొంతమంది విద్యార్థులను యాజమాన్యం వేరువేరు వాహనాలలో పాఠశాలకు తరలించారు. సంఘటన స్థలానికి శ్రీ గ్లోబల్ హై స్కూల్ యాజమాన్యం చేరుకొని… ఆటో డ్రైవర్ నరసింహారావుని 108 ద్వారా ఖమ్మంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. సంఘటనపై విచారణ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -