గుల్జార్ హౌస్ ఘటనపై ఆరా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గుల్జార్ హౌస్ ప్రమాదం ఎలా జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. సీఎంకు ఫోన్ చేసి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసు కున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం ఆయనకు వివరిం చారు. ఎప్పటి కప్పుడు సహాయక చర్యలను పర్యవే క్షిస్తున్నట్టు తెలిపారు. ఘటనాస్థలికి మంత్రులు వెళ్లినట్టు సీఎం వివరించారు.
అత్యంత బాధాకరం: రాహుల్‌గాంధీ
హైదరాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలతోసహా 17 మంది చనిపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
సంతాపం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి వైద్యానికి కావాల్సిన సహయం అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
దిగ్భ్రాంతికరం : సీఎం రేవంత్‌రెడ్డి
పాత బస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుల్జార్ హాస్ ప్రమాదంలో మరణించిన వారికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విచారకరం : ప్రతి పక్ష నేత కేసీఆర్
పాతబస్తీలోని చార్మినార్ సమీపంలోగల గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఖర్గే ఫోన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES