Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆటలుతెలంగాణకు ఖేలో ఇండియా గేమ్స్‌!

తెలంగాణకు ఖేలో ఇండియా గేమ్స్‌!

- Advertisement -

కేంద్ర క్రీడా మంత్రి మాండవీయకు రాష్ట్ర బృందం వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ : 2026 ఖేలో ఇండియా క్రీడలను తెలంగాణలో నిర్వహించాలని, రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ శివసేనా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డిలతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన శ్రీహరి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ‘ఖేలో ఇండియా క్రీడలను తెలంగాణలో నిర్వహించండి. సీఎం రేవంత్‌ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్‌ అకాడమీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇచ్చి సహకరించండి’ అని కేంద్ర మంత్రితో శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా క్రీడల కేటాయింపుపై సానుకూలంగా స్పందించిన మాండవీయ.. తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వస్తానని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad