Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండవ రోజు కొనసాగుతున్న ఖోఖో క్యాంప్ శిబిరం

రెండవ రోజు కొనసాగుతున్న ఖోఖో క్యాంప్ శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
క్రీడలతో ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చు కల్వకుర్తి పట్టణం బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న 58వ ఖోఖో సీనియర్ బాలుర బాలికల క్రీడలను కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం సోమవారం సందర్శించారు. పది రోజులపాటు సాగి ఈ క్యాంపుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ మండలాల నచి విచ్చేసిన విద్యార్థులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా డాక్టర్ శివరాం మాట్లాడుతూ.. ఖోఖో క్రీడాకారులు ఈ పది రోజులు కష్టపడి క్యాంపును విజయవంతం చేయాలని అదేవిధంగా ఈనెల 7న పెద్దపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు కల్వకుర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. కల్వకుర్తిలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన తెలియజేశారు. అంతకుముందు విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేశారు. క్రీడలో ఆడేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా ఆడాలని ఎలాంటి గాయాల పాలు కాకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ శివరాం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేను కూడా చిన్నప్పుడు కోకో ఖోఖో ఆడేవాడినని ఈ క్రీడా అంటే నాకు ఎంతో ఇష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ రాజు, పిడీలు పురం చంద్, ప్రకాష్ జగన్ పీఇటి లు, తెలంగాణ ఉద్యమకారులు కూనా స్కైలాబ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -