సంక్రాంతి నుంచి డెలివరీలు
నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్ సెల్టోస్‌ను విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్‌లో దీనిని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్‌హక్ పార్క్, మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మిడ్‌సైజ్ ఎస్‌యువిలో ఇది గట్టిపోటీని ఇవ్వనుందన్నారు. గురువారం నుంచి రూ.25వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. డిసెంబర్ మధ్య నుంచి డెలివరీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కారు ధరను జనవరి 2న కంపెనీ వెల్లడించనుంది. పాత సెల్టోస్‌కు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా కొన్ని మార్పులు చేసి.. అధునిక టెక్నాలజీతో తాజాగా తీసుకొచ్చింది. పనోరమిక్ సన్‌రూఫ్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, మొత్తం 10 బాడీ పెయింట్ ఆప్షన్లతో తీసుకొచ్చింది. 1.5 లీటర్ నేచరల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ సెగ్మెంట్‌లో 4,460 మిల్లీమీటర్లతో అత్యంత పొడవైన కారు ఇదేనని వారు తెలిపారు. 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పి, హిల్ స్టార్ట్ అసిస్ట్, అన్ని వీల్స్‌కు డిస్కు బ్రేకులు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఓటీఏ అప్‌డేట్లతో కూడిన రిమోట్ కంట్రోల్ వంటివి ఉన్నాయన్నారు.
కియా కొత్త సెల్టోస్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -



