- Advertisement -
హైదరాబాద్ : పేదలు, నిస్సహాయులు, ఆకలితో ఉన్న వారికి కైండ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం గురువారం జరిగింది. నిలోఫర్ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకు అన్నం, కూర, సాంబారు, పెరుగు, పాపడ్‌తో పాటు జిలేబీ వడ్డించి, ఓ వాటర్ బాటిల్‌ను అందించారు. మాసాబ్‌ట్యాంక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ అన్న వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిలోఫర్ ఆసుపత్రి వద్ద ప్రతి వారం వెయ్యి మందికి అన్న వితరణ చేస్తున్నట్టు కైండ్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -



