Wednesday, February 25, 2026
E-PAPER
Homeసినిమా100కి పైగా భాషల్లో 'కింగ్‌ బుద్ధ'

100కి పైగా భాషల్లో ‘కింగ్‌ బుద్ధ’

- Advertisement -

ప్రపంచ శాంతి కోసం థాయ్ లాండ్‌కి చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు(మాంక్స్‌) ఈనెల 22 నుంచి కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుండి తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్‌ బుద్ధభూమి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి తుర్కయాంజిల్‌ వరకు 17 కిలోమీటర్ల వరకు జరిగిన పాదయాత్రలో ‘కింగ్‌ బుద్ధ’ హాలీవుడ్‌ డైరెక్టర్‌ సత్యారెడ్డి, చిత్ర యూనిట్‌ పాల్గొంది.
ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ‘కింగ్‌ బుద్ధ’ చిత్రాన్ని హాలీవుడ్‌లో నిర్మిస్తున్న డైరెక్టర్‌ సత్యారెడ్డి మెడలో గౌతమ బుద్ధుడి లాకెట్‌ను ధరింపజేసిన సీనియర్‌ మాంక్స్‌ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించాలని ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా సత్యారెడ్డి మాట్లాడుతూ, ‘అమెరికాలో ప్రారంభించిన ఈ హాలీవుడ్‌ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటివరకు 10 దేశాల్లో షూటింగ్‌ పూర్తయ్యింది. ఇంకా 15 బౌద్ధ దేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌, బాలీవుడ్‌, సౌత్‌ ఇండియా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రపంచంలోని 100కి పైగా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘ఉక్కు సత్యాగ్రహం’ శతదినోత్సవ సమయంలో విప్లవకవి గద్దర్‌ నాకు బౌద్ధిజం నేర్పించారని చెప్పాను. అందుకే ఆ సినిమాలో బుద్ధుని సీన్లు పెట్టాం. అలాగే ఇప్పుడు పూర్తిస్థాయిలో గౌతమ బుద్ధునిపై ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక గొప్ప ఛాలెంజ్‌గా భావిస్తున్నాను.

థాయిలాండ్‌, మలేషియాలలో టీజర్‌, ట్రైలర్‌ లాంచ్‌ చేస్తాం. ఢిల్లీ, అమరావతిలలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌ చేస్తాం. పాదయాత్ర ముగింపు వరకు మా యూనిట్‌ పాల్గొంటుంది. ప్రపంచ శాంతి కోసం స్వర్ణభూమి నుంచి బుద్ధభూమి వరకు జరిగే ఈ పాదయాత్రలు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జరపాలి. టాలీవుడ్‌ నుండి హాలీవుడ్‌ వరకు ఒక డైరెక్టర్‌గా ఎదగడం నాకు గర్వకారణం ఉంది. ప్రపంచ శాంతి సందేశంతో తెరకెక్కుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్‌ చిత్రం బుద్ధుని జీవితం, పంచశీల సిద్ధాంతాలతో ఉంటుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -