– ముంబయికి పంజాబ్ చెక్
– 4వ స్థానంతో ప్లే-ఆఫ్స్‌కు ముంబయి
జైపూర్: అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్ ఐపిఎల్‌లో టాప్ స్థానంతో ముగించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టాప్ బెర్త్ ఖాయం అనుకున్న దశలో ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సవాయిమాన్‌సింగ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 185పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు ప్రియాన్షు ఆర్యా(62), ఇంగ్లిస్(73) అర్ధసెంచరీలతో రాణించి పంజాబ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ శ్రేయస్(26నాటౌట్) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ గెలుపుతో పంజాబ్ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి 9విజయాలతో సహా 19పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిన ముంబయి జట్టు 14గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి 16పాయింట్లతో 4వ స్థానానికే పరిమితమైంది. నేడు లక్నో సూపర్ జెయింట్స్-బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే బెంగళూరు జట్టు టాప్-2లో నిలవడం ఖాయం. దీంతో గుజరాత్ 3వ స్థానానికి పడిపోతుంది.
ఆదుకున్న సూర్యకుమార్ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయిను మిస్టర్ 360 డిగ్రీస్ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సూర్యకుమార్.. చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచిన సూర్యకుమార్(57; 39బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించాడు. 2వ వికెట్‌కు రోహిత్ శర్మతో కలిసి 36 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26)తో కలిసి ముంబయి జట్టు భారీస్కోర్ సాధనకు దోహదపడ్డాడు. 19వ ఓవర్లో 4, 2తో సూర్య అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ముంబయిని ఓపెనర్లు రియాన్ రికెల్టన్(27), రోహిత్ శర్మ(24)లు చక్కని ఆరంభం ఇచ్చారు. పంజాబ్ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో తొలి రెండు ఓవర్లు 17 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్ తర్వాత గేర్ మార్చిన రికెల్టన్.. జేమీసన్ ఓవర్లో రెండు పోర్లు కొట్టి స్కోర్‌బోర్డును పరుగెత్తించాడు. నాలుగో ఓవర్ తర్వాత రోహిత్ కూడా హర్‌ప్రీత్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టాడు. అయితే.. 5వ ఓవర్లో యాన్సెన్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన రికెల్టన్.. శ్రేయస్ అయ్యర్ చేతికి చిక్కాడు. దీంతో 45 పరుగుల వద్ద ముంబయి తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(57).. హిట్‌మ్యాన్ జతగా చెలరేగాడు. రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించి.. ముంబయిని పటిష్ట స్థితిలో నిలిపాడు. హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్లో రోహిత్ ఔట్ అయ్యాక వచ్చిన తిలక్ వర్మ(1), విల్ జాక్స్(17)లు విఫలమయ్యారు. 106కే నాలుగు వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26)తో కలిసి ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యా షాట్‌కు యత్నించగా ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ ఇంగ్లిస్ అందుకున్నాడు. ఆ తర్వాత.. జేమీసన్ 5 పరుగులు ఇచ్చాడంతే. దాంతో, ముంబయి స్కోర్ 180 దాటడం కష్టమే అనిపించింది. అయితే.. 19వ ఓవర్ తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన నమన్ ధిర్(20).. రెండో బంతినీ సిక్సర్‌గా మలిచాడు. అదే ఓవర్లో 4, 2తో సూర్య అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో విజరు కుమార్ 23 రన్స్ ఇవ్వగా ముంబయి స్కోర్ 180కి చేరింది. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ మూడే పరుగులు ఇవ్వడంతో ముంబై 184కే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఆర్ష్‌దీప్, జాన్సెన్, వ్యాషక్‌కు రెండేసి, హర్‌ప్రీత్ బ్రార్‌కు ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి)శ్రేయస్ (బి)జాన్సెన్ 27, రోహిత్ శర్మ (సి)వాథేరా (బి)హర్‌ప్రీత్ బ్రార్ 24, సూర్యకుమార్ (ఎల్‌బి)ఆర్ష్‌దీప్ 57, తిలక్ వర్మ (సి)ఆర్ష్‌దీప్ (బి)వ్యాషక్ 1, విల్ జాక్స్ (సి)జాన్సెన్ (బి)వ్యాషక్ 17, హార్దిక్ పాండ్యా (సి)ఇంగ్లిస్ (బి)జాన్సెన్ 26, నమన్ ధీర్ (సి)ప్రియాన్ష్ ఆర్యా (బి)ఆర్ష్‌దీప్ 20, సాంట్నర్ (నాటౌట్) 1, అదనం 11. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 184పరుగులు.
వికెట్ల పతనం: 1/45, 2/81, 3/87, 4/106, 5/150, 6/181, 7/184
బౌలింగ్: ఆర్ష్‌దీప్ 4-0-28-2, జేమీసన్ 4-0-42-0, జాన్సెన్ 4-0-34-2, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-36-1, వ్యాషక్ 4-0-44-2.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షు ఆర్యా (సి)సూర్యకుమార్ (బి)సాంట్నర్ 62, ప్రభ్‌సిమ్రన్ (సి)అశ్వనీ కుమార్ (బి)బుమ్రా 13, ఇంగ్లిస్ (ఎల్‌బి)సాంట్నర్ 73, శ్రేయస్ (నాటౌట్) 26, వాథేరా (నాటౌట్) 2, అదనం 11. (18.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 187పరుగులు.
వికెట్ల పతనం: 1/34, 2/143, 3/171
బౌలింగ్: బౌల్ట్ 3.3-0-36-0, దీపక్ చాహర్ 3-1-28-0, బుమ్రా 4-0-23-1, సాంట్నర్ 4-0-41-2, హార్దిక్ 2-0-29-0, అశ్వనీ కుమార్ 1-0-16-0, విల్ జాక్స్ 1-0-11-0.
టాప్‌లోకి కింగ్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES