నవతెలంగాణ-కమ్మర్ పల్లి
జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా డిఆర్డిఏ- ఐకేపీ శాఖ తరుపున ఉత్తమ ఏపీఎంగా మండల ఐకేపి ఏపిఎం కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నిరంజన్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో కిరణ్ కుమార్ ఉత్తమ ఏపీఎంగా అవార్డును అందుకున్నారు.
మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు ఇవ్వడంలో మండలాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలిపినందుకు, ఐకేపీ మహిళా సంఘాలకు రుణాల మంజూరు, రికవరీ, ఐకేపీ కార్యక్రమాల్లో మంచి ప్రతిభ చూపినందుకు జిల్లా అధికారుల చేత ప్రభుత్వ ఉత్తమ ప్రశంస పత్రంను అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపిఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఐకేపి కార్యక్రమాల అమలులో సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్, సహాయ అధికారి మధుసూదన్, మండల స్థాయి అధికారులకు, ఐకేపీ సీసీ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తమ ఐకెపి ఏపీఎంగా కిరణ్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES