Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదిత్య పాఠశాలలో ఘనంగా కిసాన్ డే 

ఆదిత్య పాఠశాలలో ఘనంగా కిసాన్ డే 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా “కిసాన్ డే” ను  ఆదిత్య పాఠశాల లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, గిట్టుబాటు ధరలు లేక, రైతుల ఆత్మహత్యలపై సెమినార్లు, నాటికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి అమరెందర్ రెడ్డి  మాట్లాడుతూ నేడు రైతు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా డని, కల్తీవిత్తన కంపెనీల మోసాలు, కరువు కాటకాల, వరదతుఫాను బీభత్సాలు, ఖరీదు చదువులు, కట్నపుజ్వాలల, గిట్టుబాటు ధరల్లేక, అజ్ఞానం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపాలవుతున్నాయన్నారు.

అన్నం పెట్టే అన్నదాతకు ఆపన్న హస్తం అందిం చాలని, రైతుల ఆత్మహత్యలపై సమాజం, రాజకీయ పార్టీలు, మేధావులు, వ్యవసాయ యూనివర్సిటీలు పరిష్కారం మార్గం ఆలోచించాలని, విద్యార్థులకు కేవలం ఉద్యోగా లే కాకుండ ఆధునిక సేంద్రీయ వ్యవసాయం చేసి అధిక దిగుబడులతో లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. అదే విధంగా,  రసాయన ఎరువుల వల్ల భూమి సారం కోల్పోయి పోషక విలువలు తగ్గిపోతాయని ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, పండ్లను కార్బైడ్తో కాకుండ సహజ పద్దతిలో పండిం చాలని కాబోయే సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించటానికి సేంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు. రైతులు ఆత్మహత్యల సమాజానికి సిగ్గుచేటని రాబోయే భావితరం పంటలు పండించకపోతే సమాజం ఆకలి చావులతో అంతరి స్తుందని రైతుకు జయం కలగాలన్నారు.

 ఆరుగాలం పంటలు పండించే రైతుల రెక్కలకష్టానికి పట్టం కట్టాలని, సమైక్య వందనాలతో రైతు శ్రమకు ఫలితం దక్కాలని ఆకాంక్షించారు.విద్యార్థులు భవిష్యత్ లో వ్యవసాయం రంగం లో నూతన ఆవిష్కరణ లు చేసి రైతులకు తొడ్పాటు గా వుండాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -